
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఈ నెల చివరన సెట్స్ మీదకు వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ముందు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తాడని ఎనౌన్స్ చేయగా అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో అతని ప్లేస్ లో తమన్ వచ్చి చేరాడు. ఎన్.టి.ఆర్, తమన్ కాంబినేషన్ లో ఇప్పటికే మంచి హిట్లు వచ్చాయి.
ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి రాబోతుంది. అయితే ఈ సినిమాలో తమన్ ఎన్.టి.ఆర్ చేత కూడా ఓ పాట పాడించాలని చూస్తున్నాడట. త్రివిక్రం తన సినిమాలో హీరోలతో సరదాగా పాట పాడించే అలవాటు ఉంది ఆ లెక్క ప్రకారమే తారక్ తో కూడా త్రివిక్రం పాట పాటిస్తాడని అంటున్నారు. తమన్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలో తార తో ఓ పాట పాడించాడు. సో ఎన్.టి.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ పాట కూడా ఉంటుందన్నమాట.