పవన్ తేల్చేశాడు.. డైరక్టర్ ఫుల్ హ్యాపీ..!

అజ్ఞాతవాసి హిట్ అయితే ఎలా ఉండేదో ఏమో కాని ఆ సినిమా ఫ్లాప్ అవడంతో సినిమాలకు దూరమయ్యాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం 2019 జరుగబోయే ఎన్నికల మీదే దృష్టి పెట్టి పార్టీ కార్యకలాపాలను చూస్తున్న పవన్ ఇప్పుడప్పుడే సినిమాలను చేసే ఆలోచనలో లేడు. అయితే పవన్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్న డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ కు ఇన్నాళ్లు ఎక్కడో ఓ చిన హోప్ ఉండేదట. కేవలం 40 రోజుల కాల్ షీట్ తో పవన్ సినిమా పూర్తి చేయాలని చూశారు.


అయితే మైత్రి మూవీ మేకర్స్ కు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో సంతోష్ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఆ కథనే నాచురల్ స్టార్ నానితో సినిమా చేయాలని చూస్తున్నాడట సంతోష్ శ్రీనివాస్. విజయ్ నటించిన తెరి సినిమానే స్క్రీన్ ప్లే కొత్తగా రాసి ఈ సినిమా చేస్తున్నారట. మరి నాని సంతోష్ శ్రీనివాస్ ఈ కాంబినేషన్ లో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.