అఖిల్ అతనితో ఫిక్సేనా..!

అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ హీరోగా చేసిన రెండు సినిమాలు నిరాశ పరచాయి. మొదటి సినిమా అఖిల్, రెండవ సినిమా హలో రెండూ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. అందుకే 3వ సినిమా డైరక్టర్ విషయంలో మరింత సంక్షోభంలో పడ్డాడు అఖిల్. ఇక ఈమధ్యనే తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అఖిల్ కు కథ వినిపించగా.. కథ నచ్చిన అఖిల్ ఫైనల్ గా అతనికి ఓకే చెప్పాడట.

అఖిల్ మూడవ సినిమా రేసులో కొరటాల శివ, సుకుమార్, సత్య పినిశెట్టి ఉండగా వీరెవరిని కాదని వెంకీ అట్లూరితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అఖిల్. త్వరలోనే ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందట. ఈ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్ లోనే నాగార్జున నిర్మిస్తారని తెలుస్తుంది. తనయుడిని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో నాగార్జున కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.