
శ్రీమంతుడు తర్వాత కొరటాల శివతో మహేష్ చేస్తున్న సినిమా భరత్ అనే నేను. విజన్ ఆఫ్ భరత్ అంటూ సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతుంది. మహేష్ సిఎంగా కనిపించబోతున్న ఈ సినిమా ఇదవరకు తెలుగులో వచ్చిన ముఠామేస్త్రీ, ఒకే ఒక్కడు సినిమాల స్పూర్తితో వస్తున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రీలో చిరు ఫైనల్ గా సిఎం అవుతాడు.
ఒకే ఒక్కడు సినిమాలో కూడా ఒక్కరోజు సిఎంగా అర్జున్ తో రికార్డులు సృష్టించాడు శంకర్. ఈ రెండు సినిమాల్లో లానే అమ్మకు ఇచ్చిన మాట కోసం సిఎంగా భాధ్యత తీసుకున్న మహేష్ ఎలా సొసైటీలో చేంజ్ తీసుకొచ్చాడు అన్నది సినిమా. సినిమాలో స్టైలిష్ లుక్ లో మహేష్ అదరగొట్టాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.