మహానటి పోస్ట్ పోన్ అయినట్టే..!

సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మహానటి. కీర్తి సురేష్ లీడ్ రోల్ గా వస్తున్న ఈ సినిమాలో సమంత, షాలిని పాండే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, క్రిష్ లు నటిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ గా శర్వానంద్ కూడా కనిపిస్తాడని టాక్.

ఇక మార్చి 29న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. మార్చి 30న మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం సినిమా రాబోతుంది. ఇక ఏప్రిల్, మేలలో స్టార్ సినిమాలు ఉన్నాయి. అందుకే మహానటి సినిమాను జూన్ కు వాయిదా వేశారని తెలుస్తుంది. సావిత్రి గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమాలో చూపిస్తారని అంటున్నారు.