విక్కీనయన్ బయటపడ్డ సీక్రెట్..!

కొన్నాళ్లుగా డైరక్టర్ విఘ్నేష్ శివ, హీరోయిన్ నయనతార ప్రేమించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నయనతార బయటపెట్టలేదు. అయితే ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో సేదతీరుతూ తన ప్రియుడితో ఉన్న పిక్స్ ను షేర్ చేసింది నయన్. అంతేకాదు స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమోరీస్ అంటూ ట్వీట్ చేసింది. #vikkynayan నయన్ ట్వీట్స్ అండ్ పిక్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. 

మొదట్లో శింభు ఆ తర్వాత ప్రభుదేవతో ప్రేమాయణం కొనసాగించిన నయనతార సినిమాల మీద ఫోకస్ పెట్టేసింది. ఇక విఘ్నేష్ శివన్ తో పరిచయం ప్రేమగా మారడం అంతా జరిగిపోయింది. ఇన్నాళ్లు విఘ్నేష్ ప్రేమను దాచేసిన నయన్ ఫైనల్ గా స్పెషల్ మూమెంట్స్ అంటూ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటికి విఘ్నేష్ తో నయన్ పెళ్లయింది అన్న వార్తలు కూడా వచ్చాయి. కాని వాటిపై మాత్రం ఎవరు నోరు విప్పలేదు.