
కొన్నాళ్లుగా టాలీవుడ్ లో వినిపిస్తున్న అహం బ్రహ్మస్మి టైటిల్ డైరక్టర్ గా క్రిష్ కన్ఫాం అవగా.. హీరో ఎవరన్నది తేలాల్సి ఉంది. మొదట వరుణ్ తేజ్ నుండి మొదలైన హీరోల ప్రస్థావన చివరకు బాలకృష్ణ దగ్గరకు వచ్చి ఆగింది. క్రిష్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చేశారు. ఆ సినిమాతో హిట్ అందుకోవడంతో ఈ కాంబినేషన్ పై క్రేజ్ పెరిగింది.
ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేస్తున్నాడు. కంగనా రనౌత్ లీడ్ రోల్ గా వస్తున్న ఈ సినిమా ఝాన్సి లక్ష్మి భాయ్ చరిత్రతో రాబోతుంది. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత క్రిష్ అహం బ్రహ్మస్మి సినిమా చేస్తాడని అంటున్నారు. బాలయ్యతో మరోసారి క్రిష్ సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపయ్యింది.