2.ఓ టీజర్ లీక్.. అయ్యిందా.. చేశారా..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా 450 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. 3, 4 సార్లు రిలీజ్ డేట్లు వాయిదా పడిన ఈ సినిమా టీజర్ కూడా ఇప్పుడు అప్పుడు అని ఊరించారు కాని రిలీజ్ చేయలేదు. అయితే చిత్రయూనిట్ కు షాక్ ఇస్తూ 2.ఓ 59 సెకన్ల టీజర్ నెట్ లో దర్శనమిచ్చింది.

దర్శక నిర్మాతల ప్రమేయం లేకుండానే ఈ టీజర్ లీక్ అయ్యిందని తెలుస్తుంది. ఇక టీజర్ లీక్ అయినా సరే సినిమా మీద ఉన్న క్రేజ్ తో అది కాస్త సంచలనంగా మారింది. శంకర్ నుండి రాబోతున్న మరో అద్భుత సృష్టి 2.ఓ. అయితే ఈ లీకు పట్ల కోలీవుడ్ లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సినిమా మీద స్పెషల్ టాక్ రావాలనే ఉద్దేశంతోనే ఇలా లీక్ అంటూ చెబుతున్నారని.. టీజర్ వారే కావాలని లీక్ చేశారని అంటున్నారు. మరి ఏది వాస్తవం అన్నది తెలియదు కాని 2.ఓ టీజర్ మాత్రం సెన్సేషన్ అయ్యింది.