త్రివిక్రం సినిమాలో లయ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఈ నెల 26నుండి సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కూడా ఉంటుందని లేటెస్ట్ టాక్. నిన్నటితరం హీరోయిన్ గా లయ అందరికి సుపరిచితురాలే.

అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బు పాత్రల్లానే తారక్ సినిమాలో లయ కూడా స్పెషల్ రోల్ లో కనిపిస్తుందని అంటున్నారు. ముందు ఈ రోల్ కోసం ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా లయకు ఫిక్స్ అయ్యారట. హీరోయిన్ గా గుడ్ బై చెప్పేసిన లయ ఇప్పుడు సపోర్టింగ్ రోల్ తో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ లు నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా బరిలో దించాలని చూస్తున్నారు.