నలుపు శ్రమజీవుల వర్ణం.. కాలా టీజర్ టాక్..!

సూపర్ స్టార్ రజినికాంత్ పా. రంజిత్ కాంబోలో వస్తున్న సినిమా కాలా. కబాలి తర్వాత క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ కాలా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ తో మరోసారి తన సత్తా చాటుకున్నాడు పా. రంజిత్. రజిని టీజర్ అతనికిమించి ఎవరు ఈ రేంజ్ లో కట్ చేయలేరు అన్న విధంగా కబాలి ఉంది. 

ఇక ఇప్పుడు కబాలిని మించిన టీజర్ గా కాలా టీజర్ సంచలనాలు సృష్టిస్తుంది. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్లో ధనుష్ నిర్మిస్తున్న్ ఈ సినిమాలో నానా పటేకర్ తో పాటుగా హుమా ఖురేషి నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న కాలా టీజర్ లో కూడా మ్యూజిక్ పనితనం చూపించాడు. ఏప్రిల్ 27న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ కాలా టీజర్ లో డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మరి రజిని పూర్తిస్థాయి రౌడియిజం చూపించాలనుకున్న ఈ కాలా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.