
భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నా సరే మహేష్ 25 సినిమా ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మాతలుగా ఉంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు కెమెరామన్ గా మోహనన్ ను తీసుకొస్తున్నారు.
బాలీవుడ్ లో క్రేజీ సినిమాటోగ్రాఫర్ గా మోహనన్ కు మంచి డిమాండ్ ఉంది. షారుఖ్, ఆమీర్ సినిమాలకు పనిచేసి తన కెమెరా పనితనం చూపించిన మోహనన్ మొదటిసారి తెలుగు సినిమా చేస్తున్నాడు. ఊపిరి తర్వాత వంశీ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దెని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. మహేష్ భరత్ అనే నేను పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.