డుంగురు.. డుంగురు.. రంగస్థలం పాట సూపరు..!

రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంగా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రెస్టిజియస్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఎంత సక్కగున్నావే రిలీజ్ అవగా ఇప్పుడు సినిమాలో సెకండ్ సాంగ్ అది కూడా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. 

రంగా.. రంగా.. రంగస్థలానా అంటూ మొదలు పెట్టి డుంగురు డుంగురు అంటూ మాస్ బీట్ తో మోతమోగించేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఇక ఈ పాటలో చెర్రి స్టెప్పులు కూడా అదిరిపోయేలా ఉన్నాయి. సాంగ్స్ తోనే సినిమా రిలీజ్ ముందే సగం హిట్ అనేలా దుమ్మురేపిన దేవి సినిమా చూశాక ఇంకెంత హంగామా చేస్తాడో అంటున్నారు.

సినిమాలో ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి కూడా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. మరి చిట్టిబాబు చేసే రంగస్థలం హంగామా ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.