
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా మార్చి 26 నుండి సెట్స్ మీదక్కు వెళ్లబోతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో కె. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హగ్దె, శ్రద్ధ కపూర్ హీరోయిన్స్ గా ఫైనల్ అయ్యారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ ను దసరాకి ఫిక్స్ చేశారట. ఈమధ్య సినిమాల రిలీజ్ విషయంలో స్టార్ హీరోల సినిమాల గొడవ తెలిసిందే.
అందుకే ముందే దసరాకి మేం వస్తున్నాం అంటూ ప్రకటించేసి ఖర్చీఫ్ వేసేశారు ఎన్.టి.ఆర్, త్రివిక్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ న్యూ లుక్ ట్రై చేస్తున్నాడట. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రం చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కోసం ఎక్కువ జాగ్రత్త పడుతున్నాడట త్రివిక్రం. నందమూరి ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా చూస్తున్నాడట. మరి ఎన్.టి.ఆర్ సినిమా దసరాకి ఫిక్స్ అన్నాడు కాబట్టి మిగతా హీరోలు జాగ్రత్త పడక తప్పదు.