రాశి ప్రేమలో రాజమౌళి..!

బాహుబలి తర్వాత రాజమౌళి మెగా నందమూరి మల్టీస్టారర్ కు గురి పెట్టాడు. చరణ్, ఎన్.టి.ఆర్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. రాం చరణ్ కు జోడీగా రాశి ఖన్నా నటిస్తుందట. 

ఈమధ్యనే తొలిప్రేమతో సూపర్ హిట్ అందుకున్న రాశి ఖన్నా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటుంది. తొలిప్రేమ సినిమా చూసే రాశిని ఇష్టపడిన రాజమౌళి ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నాడట. రాశి ఖన్నాకు ఇది తప్పకుండా లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. స్టార్స్ తో సినిమాలు చేస్తున్నా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రాశి ఖన్నా జక్కన్న మల్టీస్టారర్ కెరియర్ బూస్టింగ్ కు సహకరిస్తుందని ఆశిస్తుంది.