
యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ రవిచందర్ కోలీవుడ్ లో అతని ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. అయితే తెలుగులో అతని సినిమాలు డబ్ అవుతూ వచ్చాయి కాని త్రివిక్రం, పవన్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో అనిరుద్ మ్యూజిక్ అలరించింది. అఫ్కోర్స్ సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనిరుద్ మ్యూజిక్ మీద కూడా పడిందని అన్నారు.
తెలుగులో తారక్ తో చేయాల్సిన సినిమా సైతం క్యాన్సిల్ అయ్యింది. అయితే కోలీవుడ్ లో మాత్రం మనవాడి ఫాం అలానే కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న అనిరుద్ ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినికాంత్ సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేశాడట. కాలా, 2.ఓ కాకుండా కార్తిక్ సుబ్బరాజుతో రజిని సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరక్టర్ గా ఓకే అయ్యాడు.