సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి ఇప్పటికే రమేష్, మహేష్, సుధీర్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రమేష్ ఫేడవుట్ అవగా.. మహేష్ తండ్రి వారసత్వాన్ని అందుకుని సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక అల్లుడు సుధీర్ కూడా తన మార్క్ సినిమాలను చేస్తూ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఇప్పుడు కృష్ణ గారి ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి సిద్ధమయ్యాడట. కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెరంగేట్రం చేయాలని చూస్తున్నాడు. 


త్వరలోనే జయ కృష్ణ సినిమాకు సంబందించిన విషయాలను వెళ్లడిస్తారట. నిర్మాతగా భారీ లాసులను పొందిన రమేష్ బాబుకి మహేష్ తన సపోర్ట్ అందించాడు. ఇక అన్న కొడుకు హీరోగా అవుతున్నాడు కాబట్టి అతనికి కావాల్సిన సపోర్ట్ అందిస్తాడని తెలుస్తుంది. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి మరో హీరో ఫ్యాన్స్ ను అలరించేందుకు వస్తున్నాడు. మరి జయ కృష్ణ కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి.