సాక్ష్యం శాటిలైట్ రేటు అదిరింది..!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాక్ష్యం. మే రెండో వారం లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా గ్లామర్ పండిస్తుందని తెలుస్తుంది. అందుకే సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వారు 5.5 కోట్లకు కొనేశారట.

బెల్లంకొండ సినిమాకు ఈ రేంజ్ శాటిలైట్ రైట్స్ అంటే గొప్ప విషయమే. స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే శ్రీనివాస్ బుల్లితెర మీద బాగానే క్రేజ్ తెచ్చుకున్నాడు. రీసెంట్ గా బోయపాటి డైరక్షన్ లో వచ్చిన జయ జానకి నాయకా సినిమా 16 టి.ఆర్.పి రేటింగ్ సంపాదించింది. ఈ లెక్కన చూస్తే మనవాడి సినిమాలకు 5 కోట్లు సూపర్ అనేస్తున్నారు. శాటిలైట్ ఈ రేంజ్ ఉందంటే సినిమా కూడా బాగానే వస్తున్నట్టు లెక్క.