
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ కు దర్శకధీరుడు రాజమౌళి సర్ ప్రైజ్ విజిట్ చేశారు. ఇప్పటికే సినిమా సెట్స్ కు అంతకుముందు ఓసారి చిరంజీవితో వెళ్లిన రాజమౌళి మళీ రెండోసారి తన డైరక్షన్ టీం తో కలిసి వెళ్లాడు. రంగస్థలం ఊరి సెట్ అంతా దగ్గరుండి చూశాడని తెలుస్తుంది.
రంగస్థలం ఊరి సెట్ ను రాజమౌళి రెండు సార్లు చూడటం వెనుక రీజన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. రాజమౌళి రాం చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఒకవేళ ఆ సినిమా గురించి చరణ్ తో మాట్లాడాలని సినిమా సెట్స్ కు వచ్చాడా అని అంటున్నారు. అయితే తను తీసే చరణ్, తారక్ మల్టీస్టారర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం రంగస్థలం సెట్ ఏదైనా ఉపయోగపడుతుందా అని డౌట్ పడుతున్నారు. మొత్తానికి రాజమౌళి విజిట్ తో రంగస్థలంపై క్రేజ్ మరింత పెరిగింది.