
తమిళ్ లో పెద్ద సినిమాలు చేస్తున్న సమయంలో కూడా, సమంత ఎక్కువ శాతం తెలుగు సినిమా పైనే తన దృష్టి పెట్టింది. ఇప్పుడు నాగ చైతన్యని పెళ్లాడనుందనే వార్తలు కూడా జోరందుకుంటున్నాయి. ఈ సమయంలో ఆ వార్తలకి మరింత పెట్రోల్ పోస్తూ సమంత హైదరాబాద్ లో ఇల్లు కొనబోతుందని సమాచారం. ఒక అందమైన, అంతే ఖరీదైన ఫ్లాట్ కోసం సమంత ప్రస్తుతం వెతుకుతుంది.
తన మొదటి సినిమా ఏ మాయ చేశావే హీరో చైతూని పెళ్లి చేసుకుంటే ఇదే ఇంట్లో కాపురం పెట్టే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే, ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా మోత మోగిస్తున్న సమంత, అక్కినేని బ్రాండ్ తో తెలుగు సినిమాకే పూర్తి స్థాయిలో అంకితమై, మరింత మోత మోగిస్తుందేమోనని చూడాలి. బహుశా ఇందుకేనేమో బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చిన కూడా ఇలియానా, ఆసిన్ గతే తనకే పడుతుందని ముందు జాగ్రత్త వహించి ఒప్పుకోనిది.