
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. శ్రీమంతుడు తర్వాత రాబోతున్న ఈ కాంబో సినిమా భారీ అంచనాలతో వస్తుంది. మహేష్ ఉమ్మది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కేవలం ఆంధ్రా ఏరియా కోసం 22 కోట్ల ఆఫర్ వచ్చిందట.
బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపులు ఉన్నా సరే మహేష్ స్టామినాకు తగిన హిట్ పడితే ఆ లెక్క వేరేలా ఉంటుందని భావించి భరత్ అనే నేనుకి భారీ రేటు ఇచ్చి కొనేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో పలుకుతుందని తెలుస్తుంది. ఇక శాటిలైట్ ఇప్పటికే దుమ్ముదులిపేలా పాతిక కోట్లు అంటుండగా మళ్లీ మహేష్ సినిమా ఎలా లేదన్నా 150 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవుతుంది.
ఏప్రిల్ 20న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా శ్రీమంతుడు హిట్ మేనియా కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.