పాపం వెంకటేష్ ఆమెతోనే అడ్జెస్ట్..!

టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కరువయ్యారని తెలిసిందే. ముఖ్యంగా వెంకటేష్ కు తను ఎంచుకున్న కథలకు సరిపడే హీరోయిన్స్ దొరకట్లేదు. గురు తర్వాత వెంకటేష్ చేస్తున్న సినిమా ఆటా నాదే వేటా నాదే. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకున్నారు. నయనతార, అనుష్క, చివరకు అదితి రావు కూడా సారీ అనేసరికి ఎవరిని తీసుకోవాలో తెలియక ఫైనల్ గా శ్రీయనే ఫిక్స్ చేశారట.

శ్రీయ హీరోయిన్ గా ఫైనల్ అయినట్టే అంటున్నారు. సినిమాలో హీరోయిన్ ది మదర్ రోల్ అని తెలుస్తుంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా నయన్, అదితి నటించడానికి ఇష్టపడలేదట. అయితే ఆల్రెడీ గోపాల గోపాలలో శ్రీయ వెంకటేష్ కలిసి నటించారు. అంతేకాదు ఈ సినిమాకు మరో స్పెషల్ ఏంటంటే వెంకటేష్ తన కెరియర్ లో 72వ సినిమా ఇది కాగా.. శ్రీయకి ఇది 72వ సినిమా అట. ఏంటి వెంకటేష్ తో పాటుగా శ్రీయ 72 సినిమాలు చేసిందా అంటే.. గెస్ట్ రోల్స్, ఐటం సాంగ్, కెమియో ఇవన్ని కలుపుని శ్రీయ 71 సినిమాలు పూర్తి చేసిందట. చూస్తుంటే అమ్మడు సెంచరీ కొట్టేలానే ఉందని అంటున్నారు.