
కుమారి 21ఎఫ్ తో సూపర్ ఫాం లోకి వచ్చిన రాజ్ తరుణ్ ఆ సినిమా రేంజ్ హిట్ అందుకోవడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా వస్తుంది. ఆ సినిమాకు లవర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలా ఎలా సినిమాతో దర్శకుడిగా టాలెంట్ ప్రూవ్ చేసుకున్న అనీష్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
రిద్ది కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. జూన్ 14న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దిల్ రాజు బ్యానర్లో సినిమా అంటే కచ్చితంగా ఓ లెక్క ఉంటుంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ ట్రాక్ ఎక్కేస్తాడేమో చూడాలి. లవ్ స్టోరీనే కాని కొత్త కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.