
సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా రాబోతున్న వంశీ పైడిపల్లి మూవీపై కోర్టులో కేసు వేశారు ప్రముఖ నిర్మాత పివిపి. వంశీ పైడిపల్లితో ఉన్న గొడవల కారణంగానే ఈ కేసు వేసినట్టు తెలుస్తుంది. అసలైతే మహేష్ 25వ సినిమా పివిపి బ్యానర్లో వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేయాల్సి ఉంది. డైరక్టర్ వంశీ, నిర్మాత పివిపి గొడవల వల్ల సినిమా దిల్ రాజు, అశ్వనిదత్ ల చేతుల్లోకి వచ్చింది.
ఇక ఈ సినిమా మొదలవ్వడమే తరువాయి అన్నట్టు ఉండగా ఇప్పుడు పివిపి బ్యానర్ కోర్టు నోటీసులతో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను పూర్తి కావొస్తుండగా వంశీ పైడిపల్లి మూవీ మొదలు పెట్టాల్సి ఉంది. ఒకవేళ ఈ గొడవలు ఇలానే కొనసాగితే మహేష్ 25వ సినిమా వంశీ డైరక్షన్ లో కాకుండా వేరే సినిమా చేసే అవకాశం ఉంటుంది.