
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే.. మల్టీస్టారర్ సినిమాలకే మోస్ట్ పాపులర్ సినిమా అవడంలో సందేహం లేదు. ఎందరో దర్శక నిర్మాతలు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. అయితే అ! తో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం చిరు, బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయడమే తన లక్ష్యం అంటున్నాడు.
నాని నిర్మాతగా అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ కథ, కథనాలతో అలరించాడు. అ! సక్సెస్ తర్వాత తన దగ్గర 30 కథల దాకా ఉన్నాయని వాటిని తను డైరెక్ట్ చేయడమే కాకుండా వేరే వాళ్లకు ఇచ్చేస్తానని అంటున్నాడు. ఇక మెగా, నందమూరి కాంబో మూవీ మాత్రం తను చేసి తీరుతానని అంటున్నాడు. చిరు, బాలయ్య మల్టీస్టారర్ అంటే సాధ్యమయ్యే పనేనా అంటున్నారు.