
చందు మొండేటి డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య హీరోగా మైత్రి మూవీ నిర్మిస్తున్న సినిమా సవ్యసాచి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయతో హిట్ అందుకున్న చందు మొండేటి ప్రేమం రీమేక్ తో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక రాబోతున్న సవ్యసాచి సినిమా కూడా బిజినెస్ లో కూడా అదరగొడుతుంది.
ఓవర్సీస్ లో ఈ సినిమా 3.25 కోట్లకు డీల్ కుదిరిందట. చైతు సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ అవడం ఇదే మొదటిసారి. ఈ మొత్తాన్ని రాబట్టాలంటే అక్కడ 1 మిలియన్ గ్రాస్ సాధించాల్సిందే. కథ, కథనాల మీద ఉన్న నమ్మకంతో సవ్యసాచి బిజినెస్ భారీగా జరుగుతుందట. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
ప్రస్తుతం అక్కినేని హీరోలకు బ్యాడ్ టైం నడుస్తుంది. చైతు రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత యుద్ధం శరణం ఫ్లాప్ అయ్యింది. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగ మారుతి డైరక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.