అక్కినేని తర్వాత అక్కడ అలి రికార్డ్..!

అక్కినేని నాగేశ్వర రావు తర్వాత ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు అలి. ఇది ఇప్పటిమాట కాదు కాని ఈమధ్యనే అలి ఈ విషయం బయట పెట్టడం జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి కమెడియన్ ఆ తర్వాత హీరోగా ఇలా అన్నిటిలో తన ప్రతిభ చాటిన అలి ఇప్పుడు బుల్లితెర షోలు కూడా చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో ఏప్రిల్ 28న యమలీలకు 24 ఏళ్లని.. ఆ సినిమా అక్కినేని ప్రేమాభిషేకం తర్వాత హైదరాబాద్ శ్రీనివాస థియేటర్ లో 365 రోజులు ఆడిందని అన్నారు.

అంతేకాదు ఆ సినిమా రిలీజ్ డేట్ నే అడవిరాముడు, పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్లు పడ్డాయని గుర్తు చేశారు. శ్రీనివాస థియేటర్ లో ప్రేమాభిషేకం షీల్డ్ పక్కనే యమలీల షీల్డ్ ఉంటుందని. ఆ థియేటర్ కు ఓసారి వెళ్తే ఓ అభిమాని వేలు కోసుకుని తనకు వీర తిలకం దిద్దాడని అది నేను ఎప్పుడు గుర్తుంచుకుంటానని అన్నారు అలి. షూటింగ్ కు దుబాయ్ వెళ్తే అక్కడ నివసించే ఆప్ఘన్ ట్యాక్సీ డ్రైవర్ తనని గుర్తుపట్టి సెల్ఫీ దిగాడని అంబాని ఆఫీస్ లో పనిచేసే సి.ఈ.వోల కన్నా ఆర్టిస్టుకి ఎక్కువ పాపులారిటీ ఉంటుందని అన్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటేనో ఈ జన్మలో ఆర్టిస్టుగా పుట్టానని అలి చెప్పుకొచ్చారు.