మెగా హీరో 'అహం బ్రహ్మస్మి'..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు సక్సెస్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఫిదాతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గా వచ్చిన తొలిప్రేమతో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఘాజితో సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో హిట్ అందుకున్న సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ తో కూడా ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడట.

స్పేస్ లో ఈ సినిమా కథ ఉంటుందట. అందుకే ఈ సినిమా కోసం జీరో గ్రావిటీలో ఎలా ఉండాలో సిక్షణ తీసుకుంటున్నారట డైరక్టర్ సంకల్ప్ రెడ్డి, వరుణ్ తేజ్. కజకిస్థాన్ లో ఈ ట్రైనింగ్ జరుగుతుందట. మొత్తానికి రెగ్యులర్ హీరోల్లా కాకుండా సినిమా సినిమాకు కొత్త ప్రయోగాలతో వరుణ్ తేజ్ మెగా హీరోల్లో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా కూడా అహం బ్రహ్మస్మి అని పెట్టబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.