వెంకీ.. నితిన్.. ఇదో క్రేజీ కాంబో..!

టైటిల్ చూసి కచ్చితంగా తెలుగులో మరో క్రేజీ మల్టీస్టారర్ సిద్ధం కాబోతుందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ అది కాదులేండి.. ఈమధ్యనే ఛలో సినిమాతో హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ కుడుముల తన తర్వాత సినిమా నితిన్ తో చేస్తున్నాడు. ప్రస్తుతం ఛలో మోహన్ రంగ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్ ఆ సినిమా తర్వాత వెంకీతో సినిమా చేస్తున్నాడు.

నాగ శౌర్యతో వెంకీ తీసిన ఛలో మొదటి సినిమానే అయినా కామెడీ ఎంటర్టైనర్ గా మంచి హిట్ సాధించాడు. సినిమాతో డైరక్టర్ టాలెంట్ గుర్తించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ అతని డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేసింది. నితిన్ హీరోగా ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందట. మొత్తానికి మొదటి సినిమా ఇలా హిట్ కొట్టాడో లేదో రెండో సినిమా ఛాన్స్ పట్టేశాడు వెంకీ మరి ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఎవరు ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.