
మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మార్చి 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. 1985 కాలం నాటి కథగా రాబోతున్న ఈ సినిమాలో అప్పటి పొలిటికల్ విషయాలను కూడా ప్రస్థావిస్తారని తెలుస్తుంది. అందునా అప్పట్లో ఎన్.టి.ఆర్ పొలిటిషియన్ గా సంచలనం సృష్టించారు.
సినిమాలో ఎన్.టి.ఆర్ సీన్స్ ఉంటాయట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిట్టిబాబుగా చెర్రి అదరగొట్టబోతున్నాడట. టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా మొదటి సాంగ్ కూడా శ్రోతలను అలరించింది. మరి ఎన్.టి.ఆర్ ప్రస్థావనతో రంగస్థలం అటు నందమూరి ఫ్యాన్స్ ను కూడా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. మరి అది ఎలా ఉంటుంది.. రంగస్థలం కథా కామీషు ఏంటో చూడాలంటే మార్చి చివరి దాకా వెయిట్ చేయాల్సిందే.