
స్టార్ మా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సీజన్ లో ఎన్.టి.ఆర్ హోస్ట్ గా టి.ఆర్.పి రేటింగ్ అదరగొట్టాడు. ఇక స్టార్ మా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-2కి రంగం సిద్ధం చేస్తున్నారు. జూన్ నుండి మొదలవనున్న ఈ షోకి హోస్ట్ గా ఎవరు చేస్తారన్న కన్ ఫ్యూజన్ మొదలైంది. ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ సీజన్-2కి కష్టమే అని తెలియగా.. నాని బిగ్ బాస్-2 హోస్ట్ చేస్తాడని అంటున్నారు.
అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ బాస్-2 హోస్ట్ గా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. సినిమాలతో ఎన్.టి.ఆర్ కు గట్టి పోటీ ఇస్తున్న బన్ని ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా పోటీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇన్నాళ్లు బిగ్ బాస్ సీజన్-2గా నాని పేరు వినిపించగా.. సడెన్ గా బన్ని పేరు వార్తల్లోకి వచ్చింది. చూస్తే బన్ని ఆ సీజన్ టైంలో ఖాళీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.