డైరక్టర్ తో ఎఫైర్.. స్పందించిన హీరోయిన్..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత స్టార్ అవకాశాలను అందుకుంది. లాస్ట్ ఇయర్ జై లవ కుశలో తారక్ పక్కన నటించిన అమ్మడు ఈమధ్యనే వచ్చిన తొలిప్రేమతో ప్రేక్షకులను అలరించింది. సుప్రీం సినిమా టైంలో ఆ సినిమా డైరక్టర్ అనీల్ రావిపుడితో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. అనీల్ రావిపుడి డైరెక్ట్ చేసిన రాజా ది గ్రేట్ లో రాశి ఖన్నా అలా ఓ ఫ్రేంలో కనిపించింది.

అప్పటినుండి ఈ రూమర్స్ మరింత పెరిగాయి. అయితే ఈ వార్తలపై స్పందించింది రాశి ఖన్నా. ఓ తల్లికి బిడ్డగా తప్పు ఒప్పులు తెలిసినప్పుడు వాటికి తగ్గట్టే మలుచుకుంటానని అంటుంది రాశి ఖన్నా. ఇక మీ వ్యూస్ కోసం ఒకరికి ఒకరితో లింక్ పెట్టడం కామన్ అయ్యిందని ఫైర్ అయ్యింది రాశి ఖన్నా. ప్రస్తుతం కెరియర్ మీదే దృష్టి పెట్టిన ఈ అమ్మడు ఎఫైర్ రూమర్స్ కు చెక్ పెట్టేసింది.