చరణ్ తో బోయపాటి జిగేల్ అనిపిస్తాడట..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ క్రేజీ డైరక్టర్ బోయపాటి శ్రీను కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం పూర్తి చేసిన వెంటనే బోయపాటి సినిమాకు కేటాయించే ఆలోచనలో ఉన్న చరణ్ ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడట. ఇక సినిమా టైటిల్ గా జిల్ జిల్ జిగేల్ అని పెట్టబోతున్నారట. మాస్ అండ్ యాక్షన్ మూవీస్ లో బోయపాటిది డిఫరెంట్ స్టైల్.. అందుకే స్టార్ హీరోలు ఆయన డైరక్షన్ లో చేయాలని అనుకుంటారు.

సరైనోడు తర్వాత బెల్లంకొండ బాబుతో జయ జానకి నాయకా సినిమా తీసిన బోయపాటి చరణ్ తో జిగేల్ అనిపించేందుకు వస్తున్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చరణ్ కొత్తగా కనిపిస్తాడట అంటున్నారు. ఆల్రెడీ రంగస్థలంలో చిట్టిబాబుగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న రాం చరణ్ బోయపాటి సినిమాలో ఎలా అలరిస్తాడో చూడాలి.