
సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల ఇన్నాళ్లు నిర్మాతగా, ఆర్టిస్టుగా తన టాలెంట్ చూపించింది. ఇప్పుడు కొత్తగా మెగా ఫోన్ కూడా పట్టుకుంది. సందీప్ కిషన్, అమైరా దస్తర్ లీడ్ రోల్స్ లో మనసుకి నచ్చింది సినిమా చేసిన మంజుల ఆ సినిమాతో తన ప్రతిభ చాటాలని చూస్తుంది. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు.
మహేష్ సోదరిగా ప్రేక్షకులకు పరిచయమైన మంజుల ఈ సినిమా కోసం మహేష్ వాయిస్ ఓవర్ కూడా వాడేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ తో సినిమా విషయాలను చెప్పుకొచ్చింది. ఛాన్స్ వస్తే మహేష్ ను డైరెక్ట్ చేస్తా అని చెప్పగా.. మహేష్ కొడుకు గౌతం ఆంటీతో ఎప్పుడు సినిమా చేస్తావ్ డాడీ అంటే.. అలా చేస్తే అదే చివరి సినిమా అని చెప్పాడట మహేష్. అక్క కాబట్టి కామెడీ చేశాడని అనుకోవచ్చు. మొత్తానికి మహేష్ ప్రోత్సాహంతో మంజుల డైరక్టర్ గా కెరియర్ కొనసాగించాలని చూస్తుంది.