చిరంజీవి షాక్ అయ్యారు..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా తొలిప్రేమ. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా చూసిన మెగాస్టార్ సినిమా డైరెక్ట్ చేసింది డెబ్యూ డైరక్టరా అంటూ షాక్ అయ్యాడట. సినిమా సక్సెస్ అయినందుకు చిత్రయూనిట్ అందరికి తమ కృతజ్ఞతలు తెలిపారట. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ చిరు చెప్పిన మాటలను తను వెళ్లడించాడు.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన తొలిప్రేమ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా హిట్ లో వరుణ్ తేజ్ పాటుగా రాశి కూడా సగం మార్కులు కొట్టేసింది. తమన్ మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా అతని సక్సెస్ జోష్ కంటిన్యూ అయ్యేలా చేసింది.