ఏం పిల్లరా బాబోయ్..!

ఒక్కరోజులో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన మలయాళ భామ ప్రియా వరియర్.. ఒరు ఆదార్ లవ్ తో అంతర్జాలాన్ని తన చూపులతో స్థంభింపచేసిందంటే నమ్మాల్సిందే. యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్ ఇలా అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా ఈ అమ్మడు చాలా ఫేమస్ అయ్యింది. పక్కాగా చెప్పాలంటే ఓ స్టార్ హీరోయిన్ క్రేజ్ అమ్మడు సొంతమయ్యింది. నొసలను కదిలిస్తూ అమ్మడు చేసిన ఆ ఎక్స్ ప్రెషన్ అబ్బో కుర్రాళ్ల మతులుపోగొట్టాయి.

ఇక ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా ఇప్పుడు ఆ సినిమా టీజర్ లో ప్రియా వరియర్ మరో లుక్ రిలీజ్ చేశారు. క్లాస్ రూం లో తన ప్రేమికుడిని చూపుల తుపాకితో పేల్చుతున్న అమ్మడు నిజంగా ఇది కూడా అదే రేంజ్ లో క్లిక్ అయ్యేలా చేసింది. అప్పటివరకు ఆమె ఎవరో తెలియదు కాని ఆ టీజర్ రిలీజ్ అయ్యాక ఆమె ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ మాత్రం 2.3 మిలియన్స్ కు చేరుకోవడం విశేషం. ఈ సినిమా హంగామా చూస్తుంటే అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసినా చేసేట్టున్నారు.