
మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమా డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మార్చి 30న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ఎంత సక్కగున్నావే రిలీజ్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ చక్కని పల్లెటూరి పాటలా మనసులను తాకింది. 'ఏరు శెనగ కోసం మట్టిని తవ్వితే... ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే' అంటూ చంద్రబోస్ రాసిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
పల్లెటూరి అందాలను చూపిస్తూ సుకుమార్ చేస్తున్న ఈ ప్రయత్నం మెచ్చుకో దగినదే. చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంత ఇలా ఈ ఇద్దరు తమ కెరియర్ లో ఎప్పుడూ చేయని క్రేజీ రోల్స్ తో సినిమా చేస్తున్నారు. మొదటి సాంగ్ సూపర్ హిట్.. దేవి ఆలపించిన ఈ సాంగ్ లో సమంత క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.