'హ్యాపీ వెడ్డింగ్' నిహారిక..!

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా పరిచయమైన నిహారిక ఒక మనసు సినిమా ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి అయ్యే దాకా జరిగే పరిణామాలతో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమాలో సుమంత్, నిహారికల జంట చూడముచ్చటగా ఉంటుందని అన్నారు.


నిన్న టైటిల్ లోగో రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఆ తర్వాత ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. సుమంత్, నిహారిక స్టిల్ అదిరిపోయింది. ప్రస్తుతం తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ రావాలని ప్రయత్నిస్తున్న సుమంత్ అశ్విన్ ఈ హ్యాపీ వెడ్డింగ్ తో హిట్ కొట్టేలానే ఉన్నాడు. యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.