పూజా ఐటంకు అర కోటి..!

ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె ఆ తర్వాత చైతు ఒక లైలా కోసం సినిమాలో కూడా మెప్పించింది. ఆ వెంటనే బాలీవుడ్ లో హృతిక్ సరసన మొహెంజోదారో చేసినా అది కాస్త తుస్సుమనేసరికి మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది. ఫైనల్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాలో బికిని లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు ఆ సినిమా హిట్ తో వరుస వెంట క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమాలో స్పెషల్ నెంబర్ కు సైన్ చేసిందట. దేవి మ్యూజిక్ తో దుమ్మురేపేలా ఈ సాంగ్ ఉంటుందట. ఇక ఈ సాంగ్ కోసం పూజా దాదాపు 50 లక్షల దాకా తీసుకుందని టాక్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మరి పూజా ఐటం సాంగ్ సినిమాకు ఎంత ప్లస్ అవుతుంది.. తన కెరియర్ కు ఎంత బూస్టప్ ఇస్తుందో చూడాలి.