బిగ్ బాస్-2.. ఎన్టీఆర్ సరికొత్తగా..!

స్టార్ హీరోగానే కాదు బుల్లితెర హోస్ట్ గా కూడా ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ అదరగొట్టేశాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని ఓ క్రేజీ రియాలిటీ షోని సక్సెస్ అయ్యేలా చేసిన ఘనత తారక్ దే.. ఆయన హోస్ట్ చేశాడు కాబట్టే ఆ షోకి ఆ క్రేజ్ వచ్చింది.

స్టార్ మా ఎంతో ప్రెస్టిజియస్ గా బిగ్ బాస్ ను నడిపించింది. ఇక ఇప్పుడు సీజన్-2 కు రంగం సిద్ధమవుతుందట. బిగ్ బాస్ సీజన్ 2కి కూడా ఎన్.టి.ఆర్ వ్యాఖ్యాతగా ఉంటున్నారట. అయితే ఈసారి ఎన్.టి.ఆర్ సరికొత్త ఎనర్జీతో ఈ షో చేస్తారని తెలుస్తుంది. ఇక 10 వారాలు సాగాల్సిన ఈ షో కాస్త మరో 4 వారాలు పొడిగించారని తెలుస్తుంది. 

2018 జూన్ నుండి బిగ్ బాస్ సీజన్-2 స్టార్ట్ అవనుందని తెలుస్తుంది. ఎలాగు మొదటి సీజన్ చూశారు కాబట్టి ఈ సీజన్ లో సెలబ్రిటీస్ కూడా తమకు తాముగా ఈ షో కోసం ముందుకొస్తున్నారట. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం కాంట్రవర్సీ ఉన్న కంటెస్టంట్స్ కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది.