
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కు కూడా అత్యాశ ఎక్కువైందా.. చేస్తున్న సినిమాలు సరిపోక ఇప్పటికే స్పెషల్ ఈవెంట్స్ అంటూ దేశాలు పట్టుకు తిరుగుతున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు చేస్తున్న సినిమాలకు స్పెషల్ చార్జెస్ తో షాక్ ఇస్తున్నాడట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల చివరన ప్లాన్ చేశారట.
ఇక సినిమా ఆడియోలో డిఎస్పి స్పెషల్ లైవ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశారట నిర్మాతలు. అది చేసేందుకు ఓకే చెప్పిన దేవి అందుకు గాను పాతిక లక్షలు డిమాండ్ చేశాడట. సినిమా ప్యాకేజ్ లో భాగంగానే చేస్తాడని.. అంతగా కాకపోతే ఆ ప్రాపర్టీస్ ఖర్చు పెడదాం అనుకున్నారు నిర్మాతలు. కాని మనవాడు మాత్రం ఏకంగా ఓ ఫారిన్ ఈవెంట్ కు చెప్పిన చార్జ్ చెప్పాడు.
దీనితో సైలెంట్ అయిన నిర్మాతలు మాములుగా ఆడియో కానిచ్చేద్దాం అనుకున్నారట. అయితే సుకుమార్, దేవి శ్రీ రిలేషన్ బాగుంటుంది కాబట్టి అతని ద్వారా ఈ పర్ఫార్మెన్స్ గురించి బేరాలు చేస్తున్నారట.