
టాలీవుడ్ లో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుందని చెప్పొచ్చు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా గోపాల గోపాల, ఊపిరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మల్టీస్టారర్ అనుభూతిని ఇస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కే ఓ క్రేజీ మల్టీస్టారర్ పై అందరి దృష్టి ఉంది. అదే కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నానిలు కలిసి చేస్తున్న సినిమా.
శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాగార్జున డాన్ గా కనిపిస్తారట. ఇక నాని డాక్టర్ గా దర్శనమిస్తాడట. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందట. నాచురల్ నటనతో వరుస హిట్లు కొడుతున్న నాని, నాగార్జునతో కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇక నాగార్జున మాత్రం వర్మ డైరక్షన్ లో శపథం త్వరలో పూర్తి చేసి ఈ సినిమాకు డేట్స్ ఇస్తాడట. ఇక ఈ సినిమా తర్వాత కూడా కోలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు ధనుష్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.