
సెలబ్రిటీ అంటే ప్రేక్షకులకు కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే తామేదో స్టార్స్ అన్న బిల్డప్ కొంతమందికి బాగా ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో ఓకే కాని చాలా సందర్భాల్లో అతిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భమే ఒకటి టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయను ఇబ్బందుల్లో పడేసింది. అసలు విషయం ఏంటి అంటే సరదాగా రోడ్ మీద వెళ్తుంటే అనసూయ కనబడితే ఆ ఉత్సాహం ఎలా ఉంటుంది.
ఏ వయసు వారికైనా అనసూయ అంటే ఇష్టం.. అదే క్రమంలో ఓ పిల్లాడు అనసూయని చూసి ఆత్రుతగా ఆమెతో ఫోటో దిగేందుకు దగ్గరకు వచ్చాడట. ఫోన్ తీసి సెల్ఫీ తీసేలోగా అతని ఫోన్ తీసి కింద కొట్టేసిందట. ఇదేంటి అనేలోగా ఆ పిల్లాడిని.. అతని పక్కనే ఉన్న అతని తల్లిని దుర్భాషలాండిందట. జరిగిన సంఘటనపై మనోవేదనకు గురైన ఆ పిల్లాడి తల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందట. అన్సూయ కారు నెంబర్ తో సహ వారు కేసులో ఫిర్యాదు చేయడం విశేషం.
ఏదో పిల్లాడు ముచ్చట పడ్డాడు అతనొక్కడికే ఏదో సెల్ఫీ లా మమా అనిపించేస్తే పోయేది. అప్పటికి కుదరకపోతే మాములుగా రిజెక్ట్ చేస్తే బాగుండేది.. ఫోన్ పగుల కొట్టడం.. ఆ తర్వాత బూతు మాటలు అనడం అనసూయ లాంటి వారికి తగదు. ఇదే విషయంపై షాక్ అయిన సదరు మహిళ అనసూయ మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.