శ్రీయా పెళ్లికి టైం వచ్చింది..!

టాలీవుడ్ లో ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది శ్రీయ దాదాపు 15 ఏళ్ల కెరియర్ కొనసాగించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు ఆ మధ్యలో కాస్త వెనుక పడినట్టు అనిపించినా మళ్లీ ఫాం కొనసాగించింది. ఇయర్ ఇయర్ కు కొత్త భామలొస్తున్నా శ్రీయా మాత్రం ఇప్పటికి క్రేజ్ కొనసాగిస్తుంది. సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంటున్న ఈ భామ ఇక పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందట.

కొన్నాళ్లుగా రష్యాకు చెందిన వ్యాపారవేత్తతో శ్రీయా ప్రేమలో ఉందని తెలుస్తుంది. ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అంగీకారం తెలిపారట. మార్చి నెలలో శ్రీయ పెళ్లి బాజాలు మోగనున్నాయని టాక్. కెరియర్ మొత్తం మీద పదుల కొద్ది సినిమాల్లో నటించిన అమ్మడు పెళ్లికి సిద్ధమైందని తెలుస్తుంది. ఇప్పటికే 30 దాటగా పెళ్లికిది కరెక్ట్ టైం అని ఫిక్స్ అయ్యిందట. మరి అమ్మడి పెళ్లిపై మిగతా అప్డేట్స్ త్వరలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.