
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బెల్లంకొండ సురేష్ తనయుడు హీరోగా శ్రీనివాస్ మొదటి సినిమా నుండి స్టార్ హీరోయిన్ల సెంటిమెంట్ మిస్ అవ్వట్లేదు. మొదటి సినిమా అల్లుడు శీనుతోనే సమంత, తమన్నాలతో రొమాన్స్ చేసిన ఈ కుర్రాడు. ఆ తర్వాత రకుల్ తో కూడా జోడి కట్టాడు. ఇక ప్రస్తుతం నటిస్తున్న సాక్ష్యం సినిమాలో డిజే బ్యూటీ పూజా హెగ్దెతో జత కడుతున్నాడు.
శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే నెలలో రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా నూతన దర్శకుడు నాని డైరక్షన్ లో ఓ సినిమా కన్ఫాం చేశాడట. ఆ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇప్పటికే కాజల్ బెల్లంకొండ బాబుతో సై అన్నట్టు తెలుస్తుంది. హీరోగా తన ఫేస్ వాల్యూ ఎలా ఉన్నా హీరోయిన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
హీరోగా నిలబడాలన్న తపన బాగుండటమే కాదు సినిమా సినిమాకు నటనలో పరిణితి కనబడుతుంది. సాక్ష్యం సినిమాతో కమర్షియల్ గా హిట్ అందుకుని హీరోగా తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.