
భాగమతిగా అనుష్క ఈ ఇయర్ మొదటి సూపర్ హిట్ అందుకుంది. అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. ఇక అనుష్క ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించేసింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా హిట్ అందుకుంది. ఇక ఇప్పటివరకు సినిమా పార్తిక కోట్ల షేర్ వాల్యూ తో సూపర్ హిట్ అందుకుంది.
ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఇదవరకు రుద్రమదేవి సినిమా 9.71 లక్షల డాలర్స్ వసూళు చేయగా ఇప్పుడు భాగమతి ఆ రికార్డ్ బ్రేక్ చేసి ఏకంగా మిలియన్ మార్క్ అందుకుంది. సినిమా మీద నమ్మకంతో ఓన్ రిలీజ్ చేసుకున్న యువి క్రియేషన్స్ భాగమతితో మంచి లాభాలు పొందినట్టు తెలుస్తుంది.
సైజ్ జీరో తర్వాత అనుష్క అసలు సిసలు హిట్ సినిమాగా నిలిచింది భాగమతి. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. సినిమా హిట్ టాక్ రావడంతో కలక్షన్స్ మరింత పెంచేలా అనుష్కతో విజయాత్ర చేస్తున్నారు చిత్రయూనిట్.