చిరు, పవన్ మల్టీస్టారర్ ఉంటుంది అంతే..!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. అబ్బో ఇక ఆ సినిమా రికార్డులకు తిరుగు ఉండదని చెప్పాలి. ప్రముఖ పారిశ్రామికవేత్త కళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తానని అప్పట్లో ఎనౌన్స్ చేశారు. త్రివిక్రం డైరక్షన్ లో చిరు, పవన్ కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ తీస్తా అని అన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తుంది. రీసెంట్ గా ఇదే విషయంపై మళ్లీ ప్రస్థావించిన టి.ఎస్.ఆర్.. కచ్చితంగా ఆ సినిమా ఉంటుందని త్వరలోనే ఓ కచ్చితమైన ప్రకటన వస్తుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైరా కోసం ఈ ఇయర్ మొత్తం పనిచేయాల్సి ఉంది. ఇక 2019 ఎలక్షన్స్ వరకు పవన్ ను పలకరించడమే కష్టం. అలాంటిది పవన్, చిరు కలిసి సినిమా చేయడం అంటే మరో రెండేళ్ల తర్వాత మాటే.. మరి టి.ఎస్.ఆర్ చెప్పిన మాటల్లో వాస్తవం ఏంటో తెలియాల్సి ఉంది.