మహేష్ కు బుల్లి అభిమాని లేఖ..!

మహేష్ అభిమానుల్లో యూత్, ఫ్యామిలీ, లేడీ ఫాలోవర్స్ ఎలా ఉంటారో.. చిన్నపిల్లలు కూడా అదే రేంజ్ లో ఉంటారు. ఐ లైక్ మహేష్ వెరీ మచ్ అనే కిడ్స్ మనం చూస్తూనే ఉంటాం. ఇదే తరహాలో ఓ అమెరికా 6వ తరగతి చదువుతున్న బుల్లి అభిమాని నేహా సనంపుడిని మహేష్ కు ఓ లెటర్ రాసింది. స్కూల్ యాజమాన్యం ఆర్డర్ ప్రకారం మీ అభిమాన సెలబ్రిటీకి లెటర్ రాయమని కోరగా నేహా మహేష్ బాబుకి లెటర్ రాసింది. 


ఇంతకీ నేహా ఏం రాసిందంటే.. నా పేరు నేహా సనంపుడి. అమెరికాలోని ఈగిల్‌ రిట్జ్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాను.. చెస్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడటం ఇష్టం. స్కూల్ యాజమన్యం మీ అభిమాన సెలబ్రిటీకి లెటర్ రాయమని చెప్పారు. అందులో భాగంగా నేను మీకు లెటర్ రాశాను. నేను మీకు చాలా పెద్ద అభిమానిని. మీ ప్రతి సినిమా తప్పక చూస్తాను. మిమ్మ‌ల్ని స్పూర్తిగా తీసుకొని చాలా సంతోషంగా ఉంటున్నా. మీరు చాలా అందంగా ఉంటారు. మీరు నటించిన సినిమాల్లో శ్రీమంతుడు చిత్రం నాకెంతో ఇష్టం. సితార‌, గౌత‌మ్‌లు అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీ విలువైన సమయం కేటాయించి ఈ లెటర్ చదివినందుకు థ్యాంక్స్. మీరు బిజీగా ఉంటారని తెలుసు.. అయినా ఈ లెటర్ చదివి రిప్లై ఇస్తారని భావిస్తున్నా అని నేహా మహేష్ కు లెటర్ రాసింది. 

ఇక ఈ లెటర్ స్పెషల్ గా అనిపించడంతో మహేష్ కూడా రిప్లై ఇచ్చారు. ఇంటర్నెట్, ఈమయిల్స్ వాడుతున్న ఈ టైంలో నువ్వు రాసిన లెటర్ నన్ను ఆశ్చర్యపరచింది.. నా సినిమాలతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావన్న విషయం తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. శ్రీమంతుడు నీకెంత ఇష్టమో గౌతం, సితారలకు కూడా అంతే ఇష్టం. నీ లెటర్ చదవడం నిజంగా సంతోషంగా ఉంది. నువ్వు బాగా చదువుకోవాలను కోరుకుంటున్నా.. లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ అంటూ మహేష్ కూడా నేహాకు సర్ ప్రైజ్ రిప్లై ఇచ్చాడు. అభిమాన నటుడికి లెటర్ రాయడమే కాదు అక్కడ నుండి రెస్పాన్స్ కూడా వస్తే ఇక ఆ ఆనందం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.