
టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ కొడితే చాలు ఇక ఆ తర్వాత అమ్మడి రేంజ్ మాములుగా ఉండదు. డెబ్యూ ఫిలిం అందరిని అలరిస్తే ఆ హీరోయిన్ కోసం క్యూలు కట్టేస్తారు దర్శక నిర్మాతలు. రీసెంట్ గా నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఛలోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక మందన. ఈ సినిమా హిట్ లో తన అభినయం కూడా ఆకర్షణగా నిలిచింది.
అందుకే ఆమె డేట్స్ కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే త్రివిక్రం రష్మిక ఛలో చూసి ఇంప్రెస్ అయ్యాడట. ఎన్.టి.ఆర్ తో తీసే సినిమాలో ఒక హీరోయిన్ గా పూజా హెగ్దెని సెలెక్ట్ చేయగా మరో హీరోయిన్ గా రష్మికను తీసులునే అవకాశాలు ఉన్నాయట. అను ఇమ్మాన్యుయెల్ ను తీసుకున్నారని తెలిసినా అజ్ఞాతవాసి ఫ్లాప్ తో ఆమె ప్లేస్ లో రష్మిక ఛాన్స్ కొట్టేసిందట.
తారక్ తో సినిమా అంటే అది హిట్ అయితే ఇక రష్మికకు వరుస స్టార్ ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టే. ఛలోతో హిట్ అందుకున్న ముద్దుగుమ్మ టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్ అవుతుంది అనడంలో సందేహం లేదు.