హలో అఖిల్.. తర్వాత ఏంటి..?

అక్కినేని యువ హీరో అఖిల్ రెండవ ప్రయత్నంగా చేసిన హలో కూడా నిరాశ పరచింది. విక్రం కుమార్ లాంటి క్రేజీ డైరక్టర్ తీసిన హలో బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం రాబట్టలేదు. ఇక ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుందని భావించిన అఖిల్ కు మళ్లీ అదిరిపోయే షాక్ తగిలింది. అఖిల్ హలోకి పోటీగా నాని ఎం.సి.ఏ రిలీజ్ అవగా.. ఆ సినిమా హిట్ ఎఫెక్ట్ హలో మీద పడింది.  

ఇక ఈ సినిమా తర్వాత 3వ సినిమా కూడా డైరక్టర్ ఫిక్స్.. జనవరి 10నే ఎనౌన్స్ చేస్తా అని చెప్పిన అఖిల్ సైలెంట్ గా ఉన్నాడు. హలోకి ముందే 3వ సినిమా కథ ఓకే చెప్పుఇనా.. హలో రిజల్ట్ తేడా కొట్టడంతో డౌట్ పడ్డాడట. అందుకే మూడవ సినిమా ఎనౌన్స్ మెంట్ లేట్ అవుతుందని అంటున్నారు. తనయుల కథల విషయంలో తన జోక్యం ఉండదంటూనే అఖిల్ కు హిట్ ఇచ్చే మంచి కథ కోసం నాగార్జున వేట మొదలు పెట్టాడు. మరి అఖిల్ కు అదిరిపోయే హిట్ ఇచ్చే సినిమా ఏదవుతుందో చూడాలి.