
శివ, గోవిందా గోవిందా తర్వాత పాతికేళ్ల పైగా వెయిట్ చేసి నాగార్జునతో సినిమా చేస్తున్నాడు రాం గోపాల్ వర్మ. పోలీస్ పాత్రలో నాగార్జునను చూపిస్తూ ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. శపథం అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అవుతుంది మైరా సరీన్. మోడల్ అయిన ఈ భామ వర్మ కంట్లో పడటంతో మొదటి సినిమాకే ఏకంగా కింగ్ నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసింది.
ఇక ఓ ఈవెంట్ లో ఆమె ఎడమ చేయి చూసిన నాగార్జున.. జాతకం చెప్పేశాడట. ప్రిడిక్షన్ మీద కొంత అవగాహన ఉన్న నాగ్, మైరా సరీన్ చూసి కచ్చితంగా నీకు సినిమా పరిశ్రమలో మంచి భవిష్యత్ ఉందని అన్నాడట. దీనితో అమ్మడి కాన్ ఫిడెంట్ ఇంకాస్త పెరిగిందట. నిజంగా ఆమె చేతి గీతలు ఎలా ఉన్నాయో లేక న్యూ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను ఎంకరేజ్ చేయాలని అలా అన్నాడో కాని నాగార్జున కొత్తగా ఈ జాతకాలు చెప్పడం చూసి అందరు షాక్ అవుతున్నారు.